జాతీయంసినిమా

దిల్ రాజ్ మాస్టర్ ప్లాన్!… 100 కోట్ల నష్టాన్ని కేవలం 2 రోజుల్లోనే రికవరీ?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ గేమ్ చేంజర్ సినిమాతో భారీ నష్టాన్ని చవి చూశాడు. రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజెర్ సినిమాకు దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకుల నుండి భారీ ఎత్తున విమర్శలు రావడంతో పాటుగా సినిమా మొత్తం విడుదలైన రోజే హెచ్డీ ప్రింట్ లో లీక్ అవడం సినిమా డిజాస్టర్ అవడంతో పాటుగా నిర్మాతగా దిల్ రాజు కూడా బారి నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ఇక్కడ దిల్ రాజ్ మాస్టర్ ప్లాన్ వింటే అందరూ కూడా షాక్ అవ్వాల్సిందే. గేమ్ చేంజర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతోపాటు మరోవైపు విక్టరీ వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు కూడా దిల్ రాజ్ నిర్మాత గా వ్యవహరించారు.

ఇక్కడ దిల్ రాజ్ కు కలిగిన లాభం ఏంటని ఆలోచిస్తున్నారా!… అయితే ఇక్కడే అసలైన దిల్ రాజ్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఒకవైపు భారీ బడ్జెట్ తో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అవుతే మరోవైపు వెంకటేష్ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే రెండు సినిమాలకు దిల్ రాజ నిర్మాతగా వ్యవహరించారు. దిల్ రాజుకు గేమ్ చేంజర్ సినిమా 100 కోట్లు నష్టాన్ని తెచ్చి పెడితే, వెంకటేష్ సినిమా ఏకంగా 100 కోట్లు లాభాన్ని తెచ్చిపెట్టింది. దీంతో దిల్ రాజుకు పెద్దగా నష్టమేమీ రాలేదు. కానీ సంక్రాంతి సందర్భంగా నిర్మాతగా దిల్ రాజ్ రెండు సినిమాలను విడుదల చేయించడం అనేది దిల్ రాజ్ మాస్టర్ మైండ్ అని చాలామంది పొగుడుతున్నారు. ఎందుకంటే నాచురల్ గానే సంక్రాంతి సమయంలో సినిమా బాగుంటే కలెక్షన్లు బాగానే వస్తాయి. అది ఆలోచించే దిల్ రాజ్ రెండు సినిమాలను సంక్రాంతి సమయంలోనే విడుదల చేశాడు.

ఒకవేళ ఇక్కడ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయితే కలెక్షన్లు భారీగా వస్తాయని, అంతేకాకుండా నిర్మాతగా నాకు కూడా భారీగా లాభాలు వస్తాయని దిల్ రాజ్ ముందుగానే ఆలోచించి ఉంటాడు. ఒకవేళ ఒక సినిమా పోయినా మరో సినిమా అయినా ఆడుతుంది అని ఆలోచనతో తెలివిగా ఒకేసారి రెండు సినిమాలను దిల్ రాజ్ విడుదల చేయించడం జరిగింది. దీంతో దిల్ రాజు యొక్క మాస్టర్ మైండ్ కు ప్రతి ఒక్కరూ సలాం కొడుతున్నారు. ఏకంగా 100 కోట్లు నష్టాన్ని మరో సినిమాతో భర్తీ చేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

విచ్చల విడిగా సాగుతున్న నల్లమట్టి దందా..!?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button