సినిమా

సెప్టెంబర్ 25న టాలీవుడ్ షేక్ అవుబోతుంది!.. కారణం ఇదే?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలై ఎన్నో రికార్డులు కూడా సృష్టించాయి. కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ తో వచ్చి భారీ లాభాలను అందుకున్నాయి. మరికొన్ని సినిమాలు ఎంతో బడ్జెట్తో థియేటర్లలో విడుదలై… భారీ నష్టాలను చవిచూశాయి. అయినా కానీ చాలామంది స్టార్ హీరోల ఫేమ్ మాత్రం అలానే కొనసాగుతుంది. ఇక తాజాగా టాలీవుడ్ చరిత్రలోనే సంచలనంగా మారేటువంటి ఒక న్యూస్ చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ తీసినటువంటి రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవబోతున్నాయి. అంతేకాకుండా అవి భారీ బడ్జెట్ తో అలాగే ఎంతో ఫ్యాన్ బేస్ తో వస్తుండడంతో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటని చూస్తున్నారా?.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం.
అశ్లీల కంటెంట్ పై కేంద్రం ఉక్కుపాదం, 25 ఓటీటీ యాప్‌ లు బ్యాన్!
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ అలాగే బాలకృష్ణ నటించినటువంటి అఖండ-2 రెండు సినిమాలు కూడా సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకవైపు పవన్ కళ్యాణ్ కు మరోవైపు బాలకృష్ణకు ఎలాంటి ఫాలోయింగ్ ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను సృష్టిస్తుంది. ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అలాగే మరోవైపు బాలకృష్ణ నటించిన అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక అంతే ఆశతో అఖండ 2 కూడా హిట్ అవ్వాలని నందమూరి బాలకృష్ణ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా సెప్టెంబర్ నెలలో తేజ సజ్జ నటించినటువంటి మిరాయి సినిమా కూడా చాలా గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ షేక్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి సెప్టెంబర్ నెలలో మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి.
తెలంగాణలో స్థానిక ఎన్నికల హడావుడి స్టార్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button