
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- విజయవాడ ఇంద్రకీలాద్రి కి ఈరోజు భారీ ఎత్తున దీక్ష దారులు వస్తూ ఉన్నారు. ఎవరైతే ఇప్పటివరకు భవాని దీక్షలో ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఆ దీక్షను విరమించనున్నారు. ఇప్పటికే విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవాని దీక్షలు విరమణ మహోత్సవం ఇవాల్టితో ముగియనుండడంతో భారీ ఎత్తున కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి భవానీలు చేరుకుంటున్నారు. ఇప్పటికే యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభం అవడంతో.. ఇంద్రకీలాద్రికి దీక్షదారులు భారీగా క్యూ కట్టారు. నిన్న ఒక రోజులోనే ఏకంగా 1,50,000 మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు అని ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ భవాని దీక్షలు విరమణకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని… ఎవరైతే ఇరుముడిని సమర్పించేందుకు వస్తుంటారో వారి కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
Read also : ఎమ్మెల్యే కోమటిరెడ్డికి, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు : నూతన సర్పంచ్
ఇక ఈరోజే ఆఖరి రోజు కావడంతో ఇప్పటివరకు భవాని దీక్షలు ధరించినటువంటి అందరూ కూడా దీక్షలను విరమిస్తూ ఉన్నారు. ఇన్ని రోజులపాటు ప్రత్యేకమైనటువంటి పూజలు అలాగే ప్రత్యేక ఆహారం తీసుకుంటూ భవాని దీక్షలో ఉండి ప్రతిరోజు కూడా అమ్మవారిని స్మరిస్తూ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అన్ని సక్రమంగా జరిగితే వచ్చే ఏడాది కూడా భవాని దీక్షను చేస్తాము అని భక్తులు చెబుతున్నారు. ఇక మరోవైపు అయ్యప్ప మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములు కూడా భారీ ఎత్తున శబరిమలకు చేరుకొని అయ్యప్ప మాలలను విరమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు శబరిమల అలాగే ఇటు విజయవాడ ఇంద్రకీలాద్రి కీ వచ్చేటువంటి భక్తులందరికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎదుర్కోకుండా అన్ని భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు.
Read also : ఎన్నో విమర్శలు వస్తున్న వేల.. స్టార్ ప్లేయర్లకు మద్దతుగా నిలిచిన అభిషేక్ శర్మ!





