
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- ప్రపంచంలో దాదాపు 10% నుంచి 15% వరకు ఎడమ చేతి వాటం మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎడమ చేతితోనే ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు. (ఉదాహరణకు.. ఎడమ చేతితో రాయడం, ఎడమ చేతితో ఆటలో ఆడడం, ఎడమ చేతితో తినడం , ఎడమ చేతితో పనులు చేయడం వంటివి). నేడు అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే కాబట్టి… వీళ్ళ గురించి.. అలాగే వీళ్ళలో ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా కుడి చేతి వాటం మనుషులకన్నా.. ఎడమ చేతివాటం మనుషులకు కొన్ని స్వతంత్ర భావాలు అనేవి ఉంటాయి. వీరు తలుచుకుంటే కుడి చేతివాటం మనుషుల కన్నా ఎక్కువగా పని చేయగలరు. వీళ్ళ జ్ఞాపక శక్తి, క్రియేటివిటీ, చురుకుదనం ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి.
Read also : చంద్రబాబు మాట వినకపోతే పోలీసు అధికారులు కూడా జైలుపాలే: వైయస్ జగన్
ఇక వీరికి ఏదైనా జబ్బు చేసిన లేదా ఎటువంటి ప్రమాదంలోనైనా గాయపడిన కూడా వెంటనే కోలుకుంటారు
.. అని వైద్య నిపుణులు చెప్పుకొస్తున్నారు. అలాగే వీరు కుడి చేతివాటం మనుషుల కన్నా బాగా గేమ్స్ ఆడగలరు. ఎడమ చేతి వాటం మనుషులకు మెమొరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచనలు కూడా చాలా ఫాస్ట్ గా, చాలా తెలివిగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు మేధావులు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎడమ చేతివాటంలోని మనుషులు ఎక్కువ రాజకీయవేత్తలుగా కొనసాగుతూ ఉన్నారు. ఎడమ చేతివాటం మనుషులు ఏ రంగంలో ఉన్నా కూడా చాలా ప్రత్యేకత తో పాటు… వారికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ఈరోజు లెఫ్ట్ హ్యాండర్స్ డే కావున వీరి ప్రత్యేకల గురించి స్పెషల్గా మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్ సైట్ లో వ్రాయడం జరిగింది. కాబట్టి మీ ఫ్రెండ్స్ లేదా బంధువులలో ఎవరైనా లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ఈ న్యూస్ ను వాళ్లతో పంచుకోండి.
Read also : ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీకి పది గంటల విచారణ