
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఇవాళ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇందుకుగాను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇక సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని ఎవరూ కూడా నమ్మవద్దని ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు సలహా ఇచ్చింది. ఈ ఎగ్జామ్స్ పై తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేసే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి ఏపీ ఎస్ఎస్సి తేల్చి చెప్పినందున ఇక ఎగ్జామ్స్ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. ఇవాళ ఆదివారం రెండు పూట్ల పరీక్ష ఉంటుంది.
యూట్యూబ్ ఛానల్ ముసుగులో ‘స్పా’ సెంటర్ నిర్వహణ..?
రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ 92,000 మంది అభ్యర్థులు రాస్తున్నారు. ఇప్పటివరకు 175 కేంద్రాలలో ఈ పరీక్షలకు ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి పేపర్ ఉంటుంది. ఇక మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు రెండో పేపర్ ఉంటుందని తెలిపారు. ఇక ఉదయం 9:30 లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు హెచ్చరించారు. 9:30 సమయం దాటితే లోపలికి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. అదే మధ్యాహ్నపు పూట అయితే రెండు గంటల 45 నిమిషాలలోపే అభ్యర్థులకు పరీక్ష కేంద్రానికి అనుమతి ఇస్తామని తెలిపారు.
చంద్రబాబు పై నోరు అదుపులో పెట్టుకో కేసిఆర్, జగదీష్ ఖబర్దార్ : పిఎసిఎస్ చైర్మన్ రాములు యాదవ్
ఇక ఈ పరీక్ష జరిగే కేంద్రాల చుట్టూ దాదాపుగా వంద కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే మాత్రం కేసుల్లో పక్క ఇరుక్కుంటారని ఏపీపీఎస్సీ హెచ్చరించింది. పరీక్ష కేంద్రానికి పరిధిలో ఉన్న షాపులన్నింటినీ కూడా మూసివేయునున్నారు. ఎలక్ట్రిక్ వస్తువులు కానీ మొబైల్ కానీ ఎవరూ కూడా పరీక్ష కేంద్రానికి తీసుకురాకూడదని సూచించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా వారం రోజుల నుంచి రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి సరి చేయండి అంటూ అభ్యర్థులు ధర్నాలు చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఏపీపీఎస్సీ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆందోళన అనేది తీవ్రతరం చేశారు. కచ్చితంగా ఇది కోర్టులో నిలబడే పరిస్థితి లేదని.. ఈ ఎగ్జామ్స్ కచ్చితంగా బాయ్కాట్ చేస్తామని అభ్యర్థులు ధర్నాలో భాగంగా మాట్లాడిన మాటలు ఇవి. ఎవరైనా ఎగ్జామ్స్ తర్వాత జాబు వచ్చి ఉద్యోగంలో చేరిన కూడా ఉద్యోగ భద్రత ఉండదని హెచ్చరిస్తున్నారు. కోర్టుల జోక్యంతో మళ్లీ ప్రతి ఒక్కరు కూడా పరీక్ష రాసే పరిస్థితి వస్తుందని అంటున్నారు.
రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన వ్యక్తి మృతి