
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు ఆరోగ్యంగా ఉండడానికి నిపుణుల సలహాలు తీసుకొని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరికొందరు వారికి వారి నిర్ణయాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ తాజాగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజు కూడా నడవడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు దాదాపు 47% వరకు ప్రాణాపాయ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చట. అలాగే ఈ నడక వల్ల గుండె సమస్యలు, డిప్రెషన్, మెంటల్ హెల్త్ అలాగే షుగర్ వచ్చేటువంటి ప్రమాదం కూడా దాదాపుగా తగ్గిపోతుందట.
“సృష్టి” టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై పోలీసుల సోదాలు: డా. నమృత అరెస్ట్, కీలక పత్రాల స్వాధీనం
‘ ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ జర్నల్ లో ఒక నివేదిక తాజాగా వెలువడింది. ఈ నివేదిక ప్రకారం ప్రతిరోజు కూడా 7 అడుగులు నడిస్తే ప్రాణాపాయ ప్రమాదం అనేది దాదాపు 47% వరకు తగ్గుతుంది. అలాగే రోజుకు 4000 అడుగులు నడిచినా కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయని ఈ నివేదిక ప్రకారం వైద్యులు తెలుపుతున్నారు. ప్రతిరోజు ఎక్కువసేపు నడవడం వల్ల గుండె సమస్యలు 25%, డిప్రెషన్ 22%, మెంటల్ హెల్త్ 38%, షుగర్ వచ్చే ప్రమాదం 14% తగ్గుతుందని ఈ నివేదిక ప్రకారం వెల్లడించబడింది. ప్రతిరోజు కనీసం 30 నుంచి 50 నిమిషాలు నడవడం వల్ల చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం జస్ట్ వాకింగ్ లా నడిస్తే చాలా మంచిదని వైద్యులు తెలుపుతున్నారు.
విద్యార్దులు శారీరకంగా దృఢంగా ఉండాలి : లయన్స్ క్లబ్ ఎలైట్ గవర్నర్