
Tirumala VIP Break Darshan: తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవాస్థానం అధికారికంగా ప్రకటించింది. రెండు రోజుల పాటు ఈ దర్శనాలు క్యాన్సిల్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 15,16 తేదీల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా.. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవని తెలిపారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది.
వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు ఎందుకంటే?
తిరుమల ఆలయంలో నిర్వహించే పలు కార్యక్రమాల కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రెండు రోజుల పాటు క్యాన్సిల్ చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండ్రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు.
ఏడాదికి ఓసారి ఆణివార ఆస్థానం
ప్రతి ఏడాది సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కరాటక సంక్రాంతి రోజు ఆణివార ఆస్థానం ఉత్సవాన్ని నిర్వహిస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పుష్ప పల్లకిపై తిరుమల మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులను దర్శనమిస్తారని తెలిపింది. మరుసటి రోజు ఆలయాన్ని శుద్ధి చేసే తిరుమంజన సేవ కొనసాగుతుందని ప్రకటించింది. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు విషయాన్ని భక్తులు గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు.
Read Also: ప్రమాదంలో శ్రీశైలం గేట్లు, మార్చకపోతే తుంగభద్ర పరిస్థితేనా?