క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తిరుమల లడ్డు కల్తీ అంశము ఎంత వేడి సృష్టించిందో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలోని అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ విషయాన్ని ప్రతి రోజు కూడా సాగదీస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ అంశంపై రేపు అసెంబ్లీలో కీలక చర్చ జరగబోతుంది అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ వేదికగా రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిరుమల లడ్డు అంశంపై చర్చలు జరపాలి అని నిర్ణయించారు.
రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఈ అంశంపై కీలక చర్చలు చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ చర్చలో భాగంగానే మొత్తం పదిమంది కూటమి ఎమ్మెల్యేలు ఈ అంశంపై స్పష్టంగా మాట్లాడనున్నారు. ఇక 12:30 గంటల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ విషయంపై ప్రసంగం చేస్తారు అని అన్నారు. ఈ ప్రసంగంలో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ఒక కీలక ప్రకటన అయితే చేసే విధంగా కనిపిస్తున్నారు. ఇక ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరణించినటువంటి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ఇవాళ జరిగిన అసెంబ్లీ లో భాగంగా పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతతో సభకు హాజరు కాలేదు అని స్పష్టం చేశారు. రేపు జరగబోయేటువంటి చర్చలో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.
ఢిల్లీకి మళ్లీ బెదిరింపు కాల్స్.. అసలేం జరుగుతోంది?

