
మహేశ్వరం, ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):-
రాత్రి 12గంటల గంటల సమయంలో తుక్కుగూడ మున్సిపాలిటి పరిధిలో రావిర్యాల శ్రీ లక్ష్మీ బాలాజీ పెట్రోల్ బంక్ లో బాటిల్ తీసుకొని పెట్రోల్ కోసం ద్విచక్ర వాహనం పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు,పెట్రోల్ బంక్ మూసి వేసామని సిబ్బంది అనడంతో సిబ్బంది పై దాడికి పాల్పడుతున్న సమయంలో సిబ్బంది ఆఫీస్ రూమ్ లోపలికి వెళ్లి డోర్ పెట్టుకోవడంతో పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో అద్దాలను ధ్వంసం చేసి పారిపోయారు.వెంటనే ఆదిభట్ల పోలీసులకు సమాచారమివ్వగా స్పందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.