
Three Days School Holidays: విద్యార్థులకు సూపర్ న్యూస్. వరుసగా సెలవులు రాబోతున్నాయి. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలు మూతపడనున్నాయి. ఆగస్టు 8న శ్రావణ శుక్రవారం, ఆగస్టు 9న రాఖీ పౌర్ణమితో పాటు రెండో శనివారం. ఆగస్టు 10న ఆదివారం. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇచ్చారు. మూడు రోజులు సెలవులు కావడంతో పిల్లలతో కలిసి పేరెంట్స్ టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాఖీ పండుగ నేపథ్యంలో మహిళలు తమ పుట్టింటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
వచ్చే వారంలోనూ వరుసగా మూడు రోజులు సెలవులు
అటు ఈ నెలలో బోలెడు సెలవులు రాబోతున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం కావడంతో ఆ రోజు సెలవు ఇవ్వనున్నారు. ఆగస్టు 16న శ్రీకృష్ణాష్టమి కావడంతో సెలవు ఇస్తారు. ఇక ఆగస్టు 17న ఆదివారం. దీంతో ఈ వారంతోపాటు వచ్చే వారంలో సైతం శుక్ర, శని, ఆదివారాలు వరుసగా సెలవులు వచ్చాయి. ఆ రోజుల్లో సైతం తమ పిల్లలతో టూర్లు వెళ్లేందుకు తల్లిదండ్రులు సిద్ధం అవుతున్నారు.