క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలకు బాంబు బెదిరింపులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీ లోని ఎర్రకోట, పలు స్కూళ్లకు అలాగే అసెంబ్లీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా ఈరోజు కూడా మరోసారి ఈ ప్రముఖ ప్రాంతాలకు బెదిరింపు కాల్స్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఖలిస్తానీ గ్రూప్ పేరుతో పోలీసులకు ఈమెయిల్స్ వచ్చినట్లుగా సమాచారం. దీంతో వెంటనే స్పందిస్తూ ఎర్రకోట మరియు అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో బాంబు స్క్వాడ్ అలాగే పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. కానీ వీటి సమీప ప్రాంతాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు గుర్తించలేదు అని అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఉదయం ఎర్రకోట తో పాటుగా ఢిల్లీలోని ప్రముఖ స్కూల్స్కు కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారాలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఎర్రకోట సమీప ప్రాంతంలో ఉగ్రదాడులు జరుగుతాయి అని కొద్ది రోజుల నుంచి ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రేయి పగలు అని తేడా లేకుండా భద్రత సిబ్బంది భారీ బందోబస్తు అలాగే విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు పోలీసులు ఇలా తనిఖీలు చేస్తుండడంతో గందరగోళపు పరిస్థితులు ఏర్పడి ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు.
రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం.. నాలుగు కు చేరిన మృతుల సంఖ్య!
ఆరోజునే అల్లు అర్జున్ సినిమా టీజర్ విడుదల?

