
-
ఆయుధాలు అప్పగించడమంటే.. విప్లవాన్ని హత్య చేయడమే
-
మల్లోజుల వేణుగోపాల్, సతీష్‌ను ప్రజలు శిక్షించాలి
-
సుఖానికి, స్వార్థానికి అలవాటు పడ్డారని ఘాటు వ్యాఖ్యలు
-
సోను, సతీష్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం: అభయ్
-
మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: మావోయిస్టుల లొంగుబాటుపై పార్టీ కేంద్ర కమిటీ స్పందించింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. శత్రువుకు లొంగినవారు విప్లవ ప్రతిఘాతకులు, విచ్ఛిత్తి ద్రోహులని మండిపడ్డారు. మల్లోజుల వేణుగోపాల్, సతీష్ విప్లవ ద్రోహులని, వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, సతీష్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు అభయ్ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు విప్లవాన్ని అణచడమే లక్ష్యంగా 2024లో ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారన్నారు. ఇప్పుడు లొంగినపోయినవారంతా సుఖానికి, స్వార్థానికి అలవాటు పడ్డారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయుధాలను శత్రువుకు అప్పగించడమంటే… విప్లవాన్ని హత్యచేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి