Homeఆంధ్ర ప్రదేశ్కల్తీ నెయ్యి దోషులకు శిక్షపడాల్సిందే

కల్తీ నెయ్యి దోషులకు శిక్షపడాల్సిందే

  • అసెంబ్లీలో డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్

అమరావతి, క్రైమ్‌మిర్రర్: కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. కల్తీనెయ్యిలో ఏ రసాయనాలు వాడారో ఆ పెరుమాళ్లకే తెలియాలి. జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని ఎన్‌డీడీబీ రిపోర్టు చెప్పింది. అది నెయ్యే కాదని సీబీఐ రిపోర్టు ఇచ్చిందన్నారు.

ఇది ధర్మానికి సంబంధించిన విషయం. సకల మతాలను గౌరవించడం ఈ దేశ సంస్కృతి అన్నారు. తితిదే పాత బోర్డును జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అంటే ఆయనకూ భాగం ఉన్నట్టే కదా?‘ అని పవన్ అన్నారు.  శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి ఉపయోగించలేదని ఇప్పటికే తేలిపోయిందన్నారు. నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్దాలు చెబుతోందని.. అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని పవన్ తెలిపారు.

 నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచీ తయారు చేయొచ్చని నిరూపించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాధినేత తప్ప్పుచేశారని తానెక్కడా చెప్పలేదని.. అప్పటి టీటీడీ పాలకమండలి తన బాధ్యత నిర్వహణలో విఫలమైందని విమర్శించారు. తాము ఏ ఒక్కరిపైనా ఆరోపణలు చేయడం లేదన్నారు.
నాటి టీటీడీ బోర్డు సభ్యులను మాజీ సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. ’దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవచ్చని జగన్ చెబితే సరిపోయేది.. వెనకేసుకొస్తున్నారంటే ఆయ‌న‌కు  భాగస్వామ్యం ఉన్నట్టే కదా?’ అని అనుమానం వ్యక్తం చేశారు
రూ.20 కోట్ల లడ్డూలు రసాయనాల నెయ్యితో తయారైనట్టు తేలిందని, రసాయనాలతో తయారైన లక్ష లడ్డూలను అయోధ్యకు పంపారని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో దోషులెవరైనా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.

తాజావార్తలు