
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ వచ్చారు. జలజీవన్ మిషన్ పనులను ప్రారంభించడానికి మార్కాపురం వేదికగా పవన్ కళ్యాణ్ ఇవాళ సభ వేదిక ప్రాంగణంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలోకి చేరడానికి గల కారణాన్ని వివరించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకుడి అధికారంలో వైసిపి పార్టీ తరఫున ఎన్నో రకాలుగా సేవలను చేశారు. వైసీపీలో ఉన్న కూడా నాకు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని పవన్ కళ్యాణ్ ఇవాళ మార్కాపురం వేదికగా స్పష్టం చేశారు. గత వైసిపి ప్రభుత్వం లోను కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి నాకు ఎంతగానో అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి రాజకీయాలు ఎలా చేయాలో క్లారిటీ తెలిసిన మనిషి అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులపై కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని… చాలా పద్ధతిగా రాజకీయాలు చేస్తుంటారని… అందుకే ప్రజలు అతనికి గౌరవం ఇస్తారని చెప్పుకొచ్చారు. ఇందుకోసమే… అతని మంచితనం అలాగే రాజకీయాల్లో అనుభవం ఉంది కాబట్టే… ప్రజలకు మంచి చేస్తాడని జనసేనలోకి ఆహ్వానించడం జరిగిందని పవన్ కళ్యాణ్ గుచ్చి చెప్పారు. కూటమిని దృష్టిలో ఉంచుకొని కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొన్ని పార్టీలలో కొంత ఇబ్బందులు ఉంటాయి.. కానీ ప్రతి ఒక నాయకుడు అలాగే కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా ఓటమి కార్యకర్తలకు మరియు నాయకులకు సూచించారు.
కొండమల్లెపల్లిలో అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ దాడి!.. సిబ్బందికి హెచ్చరికలు, ప్రజలకు భరోసా