
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. అయితే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తాజాగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంది అని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. బహుశా హిందూ ధర్మాన్ని విమర్శించినందుకే నేమో.. నేడు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అన్నారు. హిందువులపై రాజకీయ క్రీడా నడపాలనుకోవడం చాలా దుర్మార్గం. ఆలయాలు అలాగే పాలక మండళ్లు, దేవాదాయ శాఖలపై కావాలనే విషయం చిమ్ముతారా?.. అని ప్రశ్నించారు. వైసిపి చేసినటువంటి పనులను ఆ దేవుడు గమనించే ఉంటాడు. బహుశా అందుకేనేమో వైసీపీ చేస్తున్నటువంటి ఈ వికృత క్రీడలను దేవుడు సైతం క్షమించలేదు. దేవుళ్లను దోచుకున్నందుకే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖలో దాదాపు ఇప్పటివరకు 500 ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చారు. కాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ హిందూ ధర్మంపై అలాగే హిందూ దేవుళ్ళ విగ్రహాలపై దాడులు చేశారని కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల సమయంలో తీవ్రంగా ఆరోపించింది. హిందూ ధర్మాన్ని విమర్శించడమే వైసీపీ పార్టీ తమ పనిగా పెట్టుకుంది అని నేడు రామనారాయణరెడ్డి తీవ్రంగా విమర్శించారు. మరోవైపు ఎలక్షన్ల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హిందూ దేవుళ్ళపై దాడులు ఆగాలి అని.. అలా జరగాలంటే కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలని అన్నారు.
Read alao : అమెరికాలో భారీ భూకంపం, 7.5గా తీవ్రత నమోదు
Read also : మెగాస్టార్‌కు బర్త్ డే విషెస్ వెల్లువ