
పులివెందుల, క్రైమ్ మిర్రర్:- ఆంధ్రప్రదేశ్ పులివెందుల జడ్పిటిసి ఉపఎన్నికల సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఘాటైన విమర్శలు చేశారు. ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రిగా ఉన్నావు… నీ జీవితానికి ఇవే ఆఖరి ఎన్నికలు కావచ్చు. ఈ వయసులో కృష్ణరామా అనుకుంటే పుణ్యం వస్తుంది, లేకపోతే నరకానికే వెళ్తావు” అని వ్యాఖ్యానించారు.
Read also : ఏపీ కొత్త బార్ పాలసీ.. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో తెలుసా?
జగన్ తన ప్రసంగంలో చంద్రబాబుపై శాపనార్థాలు చేస్తూ, ఇప్పటికైనా మార్పు తీసుకురావాలని సూచించారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలని, రాజకీయాల్లో వంచనకు తావు లేకూడదని అన్నారు. తన ప్రసంగంలో జగన్ మరో సంచలన ఆరోపణ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఈ సంబంధాల వెనుక రాజకీయ లెక్కలు ఏంటో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. పులివెందుల ఉపఎన్నిక వాతావరణంలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ వైఎస్సార్సీపీ మధ్య మాటల యుద్ధం తీవ్రతరం కాగా, ఈ కొత్త ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Read also : ఒక వైపు భారీ వర్షాలు.. మరోవైపు భూప్రకంపనలు!.. ప్రజల్లో టెన్షన్, టెన్షన్