జాతీయం

2026లో పెళ్లికి మంచి ముహుర్తాలు ఇవే..

కొత్త సంవత్సరానికి అడుగుపెట్టిన వెంటనే పెళ్లి మాటలు ఇంటిల్లిపాదీ మొదలవుతాయి. పెళ్లి కానివారు కొత్త జీవితానికి సిద్ధమవుతుంటే, ఇంట్లో పెద్దలు కూడా పెళ్లీడు వచ్చిన పిల్లలకు మంచి సంబంధాలు వెతకడం మొదలుపెడతారు.

కొత్త సంవత్సరానికి అడుగుపెట్టిన వెంటనే పెళ్లి మాటలు ఇంటిల్లిపాదీ మొదలవుతాయి. పెళ్లి కానివారు కొత్త జీవితానికి సిద్ధమవుతుంటే, ఇంట్లో పెద్దలు కూడా పెళ్లీడు వచ్చిన పిల్లలకు మంచి సంబంధాలు వెతకడం మొదలుపెడతారు. ఇప్పటికే నిశ్చితార్థాలు పూర్తయ్యి, కొంత గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకోవాలనుకునే వారు కూడా శుభ ముహూర్తాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో ఎన్ని మంచి వివాహ శుభ ముహూర్తాలు ఉన్నాయి, ఏ నెలలో ఎంత అవకాశం ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహ ముహూర్తాలకు ప్రధాన కారకులు గురు, శుక్ర గ్రహాలు. ఈ రెండు గ్రహాలు సూర్యుడికి సమీపంగా ఉండే కాలాన్ని మూఢమి కాలంగా పరిగణిస్తారు. ఆ సమయంలో శుభకార్యాలు, ముఖ్యంగా వివాహాలు చేయడం శ్రేయస్కరం కాదని పండితుల అభిప్రాయం. అందుకే 2026 సంవత్సరం ప్రారంభంలో జనవరి నెలలో వివాహ ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 14 వరకు మూఢమి ప్రభావం ఉండటంతో ఆ తేదీ వరకు పెళ్లిళ్లు చేయరాదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

ఫిబ్రవరి 14 తర్వాత నుంచి వివాహ శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో 19, 20, 21, 22, 24, 25, 26 తేదీల్లో మంచి వివాహ ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ తేదీలతో పెళ్లి సీజన్‌కు అధికారికంగా శ్రీకారం చుడతారు.

మార్చి నెలలో పెళ్లిళ్ల సందడి మరింత పెరుగుతుంది. ఈ నెలలో 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 20, 21, 25, 29 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ నెల కూడా పెళ్లిళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్‌లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 26, 28, 29, 30 తేదీల్లో వివాహ శుభ ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు.

మే నెలలోనూ ప్రారంభ భాగంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. మే 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13 తేదీల్లో పెళ్లిళ్లు చేసుకోవచ్చు. అయితే అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 18 నుంచి జూన్ 11 వరకు వివాహ ముహూర్తాలు ఉండవు. ఈ కాలాన్ని విరామంగా పరిగణిస్తారు.

జూన్ నెలలో మళ్లీ శుభకార్యాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. జూన్ 19, 20, 21, 24, 25, 27, 28 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయి. జూలై నెలలో 1, 2, 3, 4, 5, 8, 9 తేదీల్లో పెళ్లిళ్లకు మంచి కాలంగా పండితులు సూచిస్తున్నారు.

ఆగస్టు నెలలో కూడా పెళ్లి శుభకార్యాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో 16, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో 1, 3, 4, 5 తేదీల్లో మాత్రమే శుభ ముహూర్తాలు ఉండటంతో ఈ నెలలో పెళ్లిళ్లు కొంత తక్కువగా జరగనున్నాయి.

అక్టోబర్ నెలలో 11, 14, 29, 30 తేదీల్లో వివాహ శుభ ముహూర్తాలు ఉన్నాయి. నవంబర్ నెలలో కార్తీక మాసం సందర్భంగా పెళ్లిళ్లకు మంచి కాలంగా పరిగణిస్తారు. ఈ నెలలో 11, 13, 14, 18, 19, 20, 21, 22, 24, 25, 26 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

డిసెంబర్ నెలలో కూడా పెళ్లి సందడి కొనసాగనుంది. ఈ నెలలో 2, 3, 10, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 31 తేదీల్లో వివాహ శుభ ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. మొత్తం మీద 2026 సంవత్సరం పెళ్లిళ్లకు అనుకూలంగా ఉండే సంవత్సరంగా పండితులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: నన్ను కాపాడటానికి ఎవ్వరూలేరు.. రేణుదేశాయ్ సంచలన పోస్ట్ (VIDEO)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button