Thursday, March 19, 2026
Homeఅంతర్జాతీయంస్మోకింగ్ కు , వయసుకు సంబంధం ఉంది... దక్షిణ కొరియా కీలక అధ్యయనం వెల్లడి?

స్మోకింగ్ కు , వయసుకు సంబంధం ఉంది… దక్షిణ కొరియా కీలక అధ్యయనం వెల్లడి?

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- ఈరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యువకులు స్మోకింగ్కు అలవాటు పడ్డారు. ఈ స్మోకింగ్ వల్ల ప్రమాదం చాలానే పొంచి ఉంది అని తెలిసినా కూడా వీటిని మానే పరిస్థితిలలో యువత లేరు. పెద్దలతో పాటు యువత కూడా ఈ స్మోకింగ్ కు అలవాటు పడడం వల్ల కాల్చే వీరితోపాటు పీల్చేటువంటి ఇతర వ్యక్తులకు కూడా ప్రమాదం ఉంది. ఇక తాజాగా స్మోకింగ్ కు అలాగే వయసుకు సంబంధం ఉందంటూ దక్షిణ కొరియా వెల్లడించిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 20 సంవత్సరాలలోపు స్మోకింగ్ కు అలవాటు పడ్డ యువకులకు స్ట్రోక్ ముప్పు 70 నుంచి 80 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది అని.. అలాగని మధ్యలో స్మోకింగ్ మానేసిన కూడా స్ట్రోక్ రిస్క్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు అని తేలింది. సాధారణంగా 20 సంవత్సరాల వయసులో శరీరం అనేది అభివృద్ధి చెందే దిశలో ఉంటుంది. కాబట్టి స్మోకింగ్ వల్ల విష పదార్థాలు మెదడు రక్తనాళాలు మరియు గుండె వ్యవస్థలపై శాశ్వత ప్రభావం చూపిస్తాయి అని సైంటిస్టులు పేర్కొంటున్నారు.

Read also : రాంబాబుకు సినిమా చూపిస్తాం : పెమ్మసాని చంద్రశేఖర్

Read also : ప్రెషర్ కుక్కర్ పేలిపోయే ముందు ఇచ్చే సంకేతాలివే.. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments