
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- గత కొద్ది రోజుల నుంచి వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆరోగ్య విషయంలో మార్పులు కూడా వచ్చేస్తున్నాయి. ఈ వాతావరణ మార్పు చేర్పులతో ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రతి ఫ్యామిలీలోని ఎవరో ఒకరికి జలుబు లేదా దగ్గు లాంటి లక్షణాలతో విపరీతంగా బాధలు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలితోపాటు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లేదా పెద్దలు అనే తేడా లేకుండా స్వెటర్లు మరియు వెచ్చని దుస్తులు వంటివి ధరిస్తూ ఉన్నారు. ప్రజలు ఆరోగ్య బారిన సమస్యలు పడకుండా ఉండాలి అంటే కచ్చితంగా తెల్లవారుజామున ఏడు గంటల లోపు మరియు సాయంత్రం ఏడు గంటల తరువాత బయట తిరుగకూడదు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే చల్లటి ఆహారాలు, కూల్ డ్రింక్స్, చల్లని పానీయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది అని సూచిస్తున్నారు. ఎవరైనా సరే జలుబు లేదా దగ్గుతో బాధపడుతుంటే వేడి నీటితో ఆవిరి పట్టుకోవాలని అంటున్నారు. ఒకవేళ ఈ సమస్య తీవ్రంగా అనిపిస్తే వెంటనే ఆర్.ఎం.పి డాక్టర్ వద్దకు కాకుండా ఆసుపత్రులకు వెళ్లాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
Read also : “జయ జయహే తెలంగాణ” సృష్టికర్త మరణం.. నివాళులర్పించిన ప్రముఖ వ్యక్తులు!
Read also : మత్తు పదార్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించిన రూరల్ ఎస్ఐ





