
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని యాకన్నగూడెం గ్రామ సమీపంలో రాళ్ళవాగు వంతెన నిర్మాణంలో ఉన్నందున తాత్కాలికంగా వేసిన దారి రాళ్లవాగు ఉదృత వలన కొట్టుకొని పోయింది. కావున చర్ల మరియు వెంకటాపురం మధ్య రాకపోకలు నిలిపివేయడం జరిగింది. వాహనదారులు గమనించి భద్రాచలం వైపు వెళ్లేవారు ఏటూరునాగారం- మణుగూరు మీదుగా వెళ్లవలసిందిగా వెంకటాపురం ఎస్సై తిరుపతి రావు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఎన్నో ప్రాజెక్టులు కూడా నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ లో ఒక గేటు ఎత్తడం జరిగింది. అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురవడం వల్ల అన్ని ప్రాజెక్టులు జలమయమయ్యాయి. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
మా అన్న పవన్ కళ్యాణ్ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నా : నారా లోకేష్