
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న కూడా ఇప్పటికీ రాజధాని అనే ఊసే లేదు. దాదాపుగా చాలా రోజుల తర్వాత కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అంటూ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని కి శంకుస్థాపన పనులను ప్రారంభించారు. అయితే పునర్నిర్మాణ శంకుస్థాపన పనులు ప్రారంభించి 10 రోజులు కూడా కాలేదు అప్పుడే వైసీపీ పార్టీ మాత్రం అమరావతి రాజధానిపై తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. రాజధాని అమరావతి ఒక ముంపు ప్రాంతమని, భారీ వర్షాలు పడితే రాజధాని మునిగిపోతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా అమరావతిపై చాలానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతిలో నిర్మించబోతున్న శాశ్వత భవనాలకు తీసినటువంటి పునాదులలో నీరు భారీగా చేరింది. అయితే ఈ భవనాల కోసం పునాదులు తీసినప్పుడు ఏ పునాదులలోనైనా సరే లోతులో వర్షపు మీరు వచ్చి చేరుతుంది. అదే జగన్ నివాసము ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ పక్కన కూడా ఏవైనా నిర్మాణాలు కోసం పునాదులు తీస్తే అక్కడ వర్షం పడినప్పుడు కూడా ఆ నీరు పునాదులలో చేరాల్సిందే.
ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ వైసీపీ అమరావతి పూర్తి కాకుండా చేస్తుంది. కనీస అవగాహన లేకుండా రాజధాని నిర్మాణాలపై తప్పుడు ప్రచారాలు చేయాలని ఉద్దేశంతో వైసిపి చేస్తున్న ఈ ప్రచారాలు ఆ పార్టీ పునాదులను కలిపినా కూడా వారికి మెదడుకు చేరడం లేదు. అలాగే వైసిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని టిడిపి కూడా అడ్డుకోలేక పోతుంది. అమరావతి రాజధానిపై తీవ్రవాద తరహాలో వైసిపి దాడి చేస్తూనే ఉంది. ప్రస్తుతం వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాలు రాజధాని రైతులలో చాలా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు కూటం ప్రభుత్వంలో రాజధాని పనులు ప్రారంభిస్తున్నా… మళ్లీ రేపు వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజధానిని ఉంచుతారో లేదో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఇప్పటికే అమరావతి రాజధాని కోసం అక్కడ ఉన్నటువంటి రైతులు చాలానే భూమిని ఇచ్చారు. మరి వైసిపి చేస్తున్న ఇలాంటి ప్రచారాల నేపథ్యంలో కోటం ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చే పరిస్థితి తగ్గిపోయిందని చెప్పాలి. కచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని మళ్లీ మారుస్తారు ఏమో అనీ ప్రజలందరూ కూడా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.