
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు
-
31 జెడ్పీటీసీలు, 566 ఎంపీపీ స్థానాలు
-
మొత్తం 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు వెల్లడి
-
12,778 గ్రామ పంచాయతీలు, 1.12లక్షల వార్డులు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 31 జెడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు వెల్లడించింది. 5.773 ఎంపీటీసీ స్థానాలు, 12,778 గ్రామ పంచాయతీలు, లక్ష 12వేల వార్డులను గుర్తించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ, ఎంపీపీ, సర్పంచ్‌లు, వార్డులను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఆయా స్థానాలను ఖరారు చేసింది. కాగా స్థానిక సంస్థల పదవీకాలం గత ఏడాది జనవరిలోనే ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ప్రకటనతో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం రేకెత్తుతోంది. రానున్న రెండునెలల్లో గ్రామాల్లో డబ్బుల వరద పారే అవకాశాలు కన్పిస్తున్నాయి.