
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో ఉన్న అంబిటస్ ది స్కూల్ పై వస్తున్న వదంతులు పూర్తిగా అవాస్తవమని అంబిటస్ ది స్కూల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ… అంబిటస్ ది స్కూల్ పై వస్తున్న వదంతులు పూర్తిగా అవాస్తవమని, పాఠశాల భవనం, పాఠశాల నడుపుటకు కావలసినటువంటి పూర్తి అర్హతలు పొంది పాఠశాలను నడుపుతున్నామని వారు అన్నారు.
కావాలనే కొంతమంది కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాఠశాలకు సంబంధించినటువంటి పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. పాఠశాల ఏర్పాటుకు అర్హత ఉన్న పత్రాలు తమ పాఠశాల కార్యాలయంలో నోటీసు బోర్డు నందు అందరికీ కనిపించే విధంగా ప్రదర్శనగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంబిటస్ ది స్కూల్ పై వస్తున్నటువంటి వదంతులపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు ఎలాంటి అపోహలకు లోనవ్వకూడదని ఈ సందర్భంగా పత్రిక కు ఇచ్చిన ప్రకటన ద్వారా అంబిటస్ ది స్కూల్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.