ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: సామరస్యం, దయ, కరుణ, క్షమా గుణాలను మరింత పెంపొందించాలని ప్రధాన మంత్రి మోడీ అన్నారు. ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే మనకు యేసు క్రీస్తూ చేసిన త్యాగాలన్ని గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఇవాళ ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ‘గుడ్ ఫ్రైడే’ పాటిస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తన సందేశాన్ని అందించారు.
ఈ పవిత్ర దినం సమాజంలో సామరస్యం, కరుణ, క్షమాగుణాలను మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. గుడ్ ఫ్రైడే మనకు ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తున్న ఆయన, సమాజంలో సోదరభావం, ఆశ మనందరికీ మార్గదర్శకం అవ్వాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
