
క్రైమ్ మిర్రర్,మంగపేట:- మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన సిద్ధంశెట్టి శ్రీనివాస్ రావు ప్రోత్సహంతో అప్పు ఇచ్చిన వ్యక్తులకు ఐ.పి పెడుతున్నాడని కరపత్రాలలలో ముద్రించి చేస్తున్న ప్రచారాలు అవాస్తవమని కమలాపురం కిరాణా వ్యాపారి చిదురాల సతీష్ గురువారం ప్రకటనలో తెలిపారు.కమలాపురంలో కొందరి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని కొన్ని సంవత్సరాల నుండి కిరాణం షాపు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకొంటున్న క్రమంలో వ్యాపారంలో నష్టం వాటిల్లిందని అప్పు ఇచ్చిన వ్యక్తులకు తిరిగి చెల్లించేందుకు కొంత గడువు కోరుతూ లీగల్ లాయర్ ద్వారా వారికి నోటీసులు మాత్రమే ఇచ్చానని అన్నారు.లీగల్ నోటీసులకు సిద్ధంశెట్టి శ్రీనివాస్ రావుకి ఎటువంటి సంబంధం లేదని కేవలం కొందరు వ్యక్తులు ఆయనను రాజకీయంగా,వ్యాపార పరంగా ఓర్వలేక ఆయన పేరుని బధనం చేస్తూ ఐ.పి పెట్టడానికి ప్రోత్సహించాడని కరపత్రాలలో ముద్రించి విష ప్రచారం చేస్తూ కుట్రలు పన్నుతున్నారని అన్నారు.కొంత సమయం తీసుకుని అందరికి అప్పు చెల్లిస్తానని లాయర్ సమక్షంలో ఒప్పంద పత్రం రాసి ఇచ్చానని కరపత్రాలతో చేస్తున్న ప్రచారాలను ఎవరు నమ్మొద్దని సతీష్ కోరారు.