
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :-
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి సంచలన లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో జీఎస్టీ గురించి వివరించారు. దేశ ప్రజలందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి. “స్వదేశీ వస్తువులే కొనండి.. స్వదేశీ వస్తువులే విక్రయించండి” అని చెప్పుకొచ్చారు. ఈ కొత్త జీఎస్టీ సంస్కరణ ప్రజల పొదుపును మరింత పెంచుతుందని అన్నారు. రైతులు, వ్యాపారులు, మహిళలు అలాగే యువకులు అందరికీ కూడా కొత్త జీఎస్టీ సంస్కరణ మేలు చేకూరుస్తుందని తెలిపారు. ఆర్థికపరమైనటువంటి వృత్తితోపాటు పెట్టుబడులను సైతం ప్రోత్సహిస్తామని మోడీ లేఖ ద్వారా స్పష్టం చేశారు. మనదేశంలోని ప్రతి రాష్ట్రం కూడా త్వరలో మరింత పురోగతిని సాధిస్తుందని అన్నారు. మన భారతదేశంలోని దాదాపు 25 కోట్ల మంది ఇప్పటికే పేదరికం నుంచి బయటపడ్డారు. రాబోయే రోజుల్లో పేదరికం మరింత తగ్గుతుందని అన్నారు. ఈ కొత్త జీఎస్టీ సంస్కరణల ద్వారా ఏకంగా 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయించామని అన్నారు. ఈ జీఎస్టీ సంస్కరణలు స్థానిక తయారీ రంగాన్ని కూడా మరింత బలోపేతం చేయనుందని అన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది ప్రజలందరికీ ఈ 2.50 లక్షల కోట్ల డబ్బు ఆదా కానుంది అని చెప్పుకొచ్చారు.
Read also : “పీపీపీ” పై వైసీపీది అనవసరపు రాద్ధాంతం : మంత్రి లోకేష్</అ
Read also : దానధర్మాలకు, వ్యసనాల జోలికి పోకుంటే నేటికీ 1000 కోట్లు ఉండేవి : జగపతిబాబు