
చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరు మండలం పుల్లెంల గ్రామంలో ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముక్కాముల వెంకన్న ను మండలంలోని అత్యధిక మెజార్టీ 690 ఓట్లతో గెలిపించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పక్కాగా పని చేశారు. ప్రణాళిక బద్ధంగా ఐక్యంగా క్యాంపెయిన్ చేశారు. ఇలాంటి క్యాడర్ ఉంటే ఓటమినేది ఉండదు అనే స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ కేడర్ పనిచేసింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రామానికి విచ్చేసి ప్రజలకు హామీలు ఇచ్చారు. అభ్యర్థి ముక్కాముల వెంకన్న తనకు డబ్బులు అవసరం లేదని మా ప్రజలకు వెల్మకన్నే ఫీడర్ ఛానల్, నెర్మటకు వెళ్లే రోడ్డు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కావాలని ఎమ్మెల్యేని కోరినట్లు తెలిసింది.
Read also : ఎన్నో విమర్శలు వస్తున్న వేల.. స్టార్ ప్లేయర్లకు మద్దతుగా నిలిచిన అభిషేక్ శర్మ!
ముక్కాముల వెంకన్న ను అభినందిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా గ్రామానికి వచ్చి హామీ ఇచ్చారు. ఇక గ్రామానికి చెందిన (బి ఎస్ రెడ్డి)బొబ్బల శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరడం అభ్యర్థికి మరింత కలిసి వచ్చింది. బి ఎస్ రెడ్డి ప్రజలకు చేసిన సహాయాలతో పాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన సింపతి కూడా ఇప్పటి అభ్యర్థి ముక్కాముల వెంకన్నకు ప్లస్ గా మారింది…. మాజీ ఎంపీటీసీలు వడ్డగోని రాఘవేంద్ర,సీత యాదయ్య,వడ్డగోని చంద్రశేఖర్, గండు వెంకట్ గౌడ్, మందడి శంకర్ రెడ్డి,మర్ల శంకర్ ఇరిగి వెంకన్న, నాగరాజు,సైదులు,శ్రీను కేశవులు, శ్రీనివాస్ వెంకన్న ఇలా పలువురు నాయకులు ముక్కాముల వెంకన్న మండలంలోని అత్యధిక మెజార్టీతో గెలుపొందడంలో బాగా కష్టపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని సర్పంచి ముక్కాముల వెంకన్న తెలియజేశారు.
Read also : జగిత్యాల కాంగ్రెస్ వర్గ పోరు.. పంచాయతీ ఎన్నికల్లో సంజయ్ కుమార్ వర్గానిదే పైచేయి!





