
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల గురించి వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పొగడ్తలతో ముంచెత్తారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో ఓడిపోయిన కూడా ప్రజల గుండెల్లో అలానే నిలిచిపోయారని అన్నారు. ఈమధ్య జగన్ రాష్ట్రంలో ఏ పర్యటనలో భాగంగా అయినా ముందుకెళ్తే.. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారని అన్నారు. జగన్ వస్తే… జనం కూడా భారీగా వస్తున్నారని అన్నారు. జగన్ కు జనమే ఓ వరమని… అది జగన్కు దేవుడిచ్చిన వరం అని జగన్మోహన్ రెడ్డి ని పొగడ్తలతో చెప్పారు. జగన్ పర్యటనలు అడ్డుకునేందుకు అసలు పోలీసులు ఉన్నారా? అని వైసిపి నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. జగన్ ఎక్కడ మీటింగ్ కు వెళ్లినా కూడా మర్డర్ కేసులు పెడతామని లేదా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని బెదిరించడం చాలా దారుణమైన వ్యక్తిత్వమని విమర్శించారు.
వైసీపీ దుష్ప్రచారాల పై వెంటనే స్పందించాలి.. మంత్రులను హెచ్చరించిన ఆంధ్ర సీఎం!
జగన్ చేస్తున్న పర్యటనలను వివాదాస్పదం చేయాలని కోటం ప్రభుత్వం భావిస్తుంది అని మంత్రి అంబటి రాంబాబు మీడియా వేదికగా వెల్లడించారు. జగన్ వెంట నడుస్తున్న జనాన్ని చూసి ప్రతిపక్ష పార్టీకి భయం పడుతుందని తెలిపారు. జగన్ రాష్ట్రంలోని ఏ మూల ప్రదేశానికి వెళ్ళినా కూడా వేళల్లో జనాలు తండోప తండాలుగా తరలివస్తున్నారని… అలాంటి జనాల్లో గుండెల్లో నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా విడదీయలేరని అన్నారు. జనం అంటేనే జగన్.. జగన్ అంటేనే జనం అన్నట్లుగా తెలిపారు. జగన్ను చూడ్డానికి వస్తున్న జనాన్ని ఆపడం ఎవరి తరం కాదని అన్నారు.
వైసీపీ దుష్ప్రచారాల పై వెంటనే స్పందించాలి.. మంత్రులను హెచ్చరించిన ఆంధ్ర సీఎం!
జగన్ ను చూడాలని ఎగబడ్డ కార్యకర్తలు.. తోపులాటలో ఇరుక్కుపోయిన రోజా?