క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళా సరికొత్త చరిత్ర సృష్టించింది. మౌని అమావాస్య సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కేవలం ఇవాల్టి మధ్యాహ్నం వరకే ఏకంగా 6 కోట్ల మంది భక్తులు ఈ మహా కుంభమేళాలో స్నానమాచరించారు. ఇక ఇప్పటివరకు 25 కోట్ల మంది భక్తులు హాజరయ్యి ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో పెరుగునున్న భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు!…
కాగా ఇవాళ మధ్యాహ్నం దాదాపుగా ఐదు కోట్ల మందిపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. దీంతో మహా కుంభమేళాకు హాజరైన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మంది జనంతో ప్రయాగ్ రాజ్ కిలకిలలాడుతుంది. ఎటు చూసినా లక్షల్లో జనాలు కనిపిస్తుండడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. హిందువుల అతిపెద్ద పండుగ కావడంతో ప్రపంచ దేశాల నుండి చాలామంది భక్తులు ఈ మహా కుంభమేళాకు పోటెత్తుతున్నారు. కాగా ఇవ్వాళ ఒక్కరోజే దాదాపుగా 6 కోట్ల మంది స్నానమాచరించారని యుపి ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటివరకు మహా కుంభమేళాలో స్నానమాచరించిన వారి సంఖ్య 25 కోట్లకు చేరింది. కాగా ఇవ్వాళ తెల్లవారుజామున భక్తుల రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగి దాదాపు 20 మంది భక్తులు మరణించినట్లు సమాచారం అందింది. మరోవైపు చాలామంది గాయపడినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తొక్కిసులాట ఘటన గురించి ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ రాష్ట్ర సీఎం యోగి అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించే విధంగా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మహాకుంభమేళాలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ఆరా తీస్తున్నారు.
మహా కుంభమేళాలో దర్శనమిచ్చిన రోజా!… ఫ్రెండ్స్ తో పుణ్య స్నానాలు?