
చండూరు, క్రైమ్ మిర్రర్: చండూరు కు చెందిన ఎర్రజల్ల రమేష్ వ్యవసాయ క్షేత్రంలో డ్రమ్ములలో పెద్ద మొత్తంలో నకిలీ మద్యం పట్టుబడిన విషయం విధితమే. ఈ వ్యవహారంలో రమేష్ తో పాటు కనగల్ మండలానికి చెందిన భార్గవ్ ను చండూరు కేంద్రానికి చెందిన ఓ మటన్ వ్యాపారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దందాలో మద్యం వ్యాపారులు వైన్ షాపులో పనిచేసే వర్కర్లు,కొందరు నాయకులు ఇన్వాల్వ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. పలు మండలాల్లోని మద్యం దుకాణాలకు, బెల్ట్ దుకాణాలకు ఇక్కడి నుంచి మద్యం సరఫరా చేసినట్టుగా అందరూ భావిస్తున్నారు. పోలీసుల విచారణలో ఇప్పటికే నిందితులు ఇప్పటికే పలు విషయాలను వెల్లడించినట్లుగా సమాచారం. నిందితులకు సంబంధించిన సన్నితుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఆబ్యారి అధికారులు వైన్ షాపులలోనూ తనిఖీలు చేసినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా గుట్టు చప్పుడు కాకుండా గత కొన్నాళ్లుగా ఈ దందా సాగుతుండడం…. దీన్ని ఎవరు పసిగట్టలేకపోవడం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ దందాలో పలువురి హస్తం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించనున్నట్లుగా సమాచారం. నిందితులు ఎవరెవరి పేరు చెబుతున్నారు….ఎవరిని లిఫ్ట్ చేస్తున్నారు పోలీసులు అనేది స్థానికంగా చర్చనీ అంశంగా మారింది.
ఎల్బీనగర్ వాసులకు రెడ్ అలెర్ట్.. చికెన్ తింటే మటాష్!
కడవెండి రేణుకను పట్టుకుని కాల్చి చంపారు.. మావోయిస్టు పార్టీ ప్రకటన