
క్రైమ్ మిర్రర్, మహేశ్వరం:- మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఫ్యాబ్ సిటీలో భూములు కోల్పోయిన రావిర్యాల, జన్నాయి గూడ రైతులు.. గత 22 సంవత్సరాలుగా రైతులు భూములు కోల్పోయి,ఉపాధి లేక ఆందోళన చెందుతున్నారు.సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్న పలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం కందుకూరు ఆర్ డి ఓ కార్యాలయానికి దాదాపు 100 మంది రైతులు కార్యాలయానికి వెళ్లగా ఆర్ డి ఓ లేకపోవడంతో డి.టి ఆఫీసర్ రాజేశ్వరిని కలిసి రైతులు పడుతున్న గోస తెలిపారు.ఆర్ డి ఓ కు సమాచారం ఇవ్వగా ఈ రోజు కలవడానికి కుదరదు అనడంతో రైతులు ఆర్ డి ఓ కార్యాలయం ముందు రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలుపడంతో సమాచారం అందుకున్న కందుకూరు పోలీసులు రైతులకు నచ్చజెప్పడంతో నిరసనను నిలిపివేసిన రైతులు. ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో మళ్లీ 5 రోజులు భారీ వర్షాలు… ఎల్లో అలర్ట్ జారీ!
వన్డే కెప్టెన్ గా గిల్ లేక రోహిత్ శర్మ నా?… మీ అభిప్రాయం ఏంటి ?