Thursday, March 19, 2026
Homeక్రీడలుపాకిస్తాన్ ను చిత్తు చేసి సెమీస్ లోకి అడుగుపెట్టిన భారత అండర్-19 జట్టు

పాకిస్తాన్ ను చిత్తు చేసి సెమీస్ లోకి అడుగుపెట్టిన భారత అండర్-19 జట్టు

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐసీసీ అండర్-19 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నిన్న భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠమైన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన భారత అండర్-19 జట్టు నిర్నిత 50 ఓవర్లకు 252 పరుగులు చేయగా 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ అండర్ 19 జట్టు 194 పరుగులకే ఆల్ ఓట్ అయింది. భారత్ పాకిస్తాన్ జట్టుపై ఏకంగా 58 పరుగులు తేడాతో గెలిచింది. ఇందులో ఆయుష్ మాత్రే, ఖీలాన్ చెరో మూడు వికెట్లు తీయగా.. అంబరీష్, హెనీల్, చౌహన్ మరియు విహాన్ తలో వికెట్ తీశారు. ఆయుష్మాత్రే కెప్టెన్సీలో భారత అండర్-19 జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. పాకిస్తాన్ పై గెలిచిన భారత్ డైరెక్ట్ గా సెమి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. మొదటగా పాకిస్తాన్ బ్యాటింగ్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఇండియా ఓటమి పాలవుతుంది అని అనుకున్నారు. కానీ చివరికి ఇండియన్ బౌలర్లు విరుచుకుపడడంతో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.

Read also : మంచు దుప్పటి కమ్ముకున్న తుక్కుగూడ.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన దారులు

Read also : Weather Alert: నైరుతిపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈ ఏడాది కరువు ముప్పు తప్పదా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments