క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం కాస్తో కూస్తో తగ్గిందనే చెప్పాలి. అయినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి.
ముఖ్యంగా ఏపీలో…
1. శ్రీకాకుళం
2. విజయనగరం
3. అనకాపల్లి
4. అల్లూరి సీతారామరాజు
5. ఉమ్మడి గోదావరి
ఈ ఐదు జిల్లాలలో తుఫాన్ ప్రభావం లేనప్పటికీ కూడా వర్షాలు అయితే ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉన్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట మరియు జనగామ వంటి జిల్లాలలో వర్షాలు తగ్గుముఖం పట్టినా కూడా వరద ప్రభావం అయితే ఇంకా పూర్తిగా తగ్గలేదు. దీంతో పైన పేర్కొన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలకు రేపు సెలవులు ప్రకటించాలి అని అధికారులను విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు తగ్గినప్పటికీ… కొన్ని జిల్లాలలో వరద ప్రభావం మాత్రం పూర్తిగా తగ్గలేదు. కాబట్టి అధికారులు వీటిపై దృష్టి సారించి ఆయా జిల్లాలకు రేపు కూడా సెలవులు ప్రకటించాలని కోరుతున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కూడా వాగులు,వంకలు పొంగిపొర్లుతున్న సందర్భంగా విద్యాసంస్థలకు కొన్ని జిల్లాలలో సెలవులు ప్రకటించారు. ఈ వర్షాలు ఇక నవంబర్ మొదటి వారంలోపు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మొంథా తుఫాన్ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన సందర్భంలో వ్యవసాయ పంట పొలాలు అలాగే వాగులు,వంకలు పొంగిపొర్లడం ద్వారా ఎంతో మందికి ఆర్థికంగా నష్టం కలిగింది. దీనిపై ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు ఇద్దరూ కూడా నష్టపోయిన ప్రతి వ్యవసాయ రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Read also : 38 ఏళ్ల వయసులోనూ రికార్డ్స్ సృష్టిస్తున్న రోహిత్ శర్మ
Read also : అసలైన అవినీతి యువరాజులు వీరే : ప్రధాని మోదీ





