
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
విద్యుత్ ఘాతంతో మృతి చెందిన మూగజీవాల రైతులకు ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలి అని టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ అన్నారు, బొమ్మపూర్ గ్రామ శివారులో విద్యుత్ ఘాతానికి గురై 8 దుక్కిటేద్దులు మృత్యువాత పడ్డాయి..బ్రాహ్మణపల్లి బొమ్మపూర్ రైతులకు సంబంధించినవిగా గుర్తించారు. ఎన్నో ఏళ్ల నుండి వీటిపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.. రాబోయే కాలం వ్యవసాయ సీజన్ కావున ఆయా బాధిత రైతుల ఆవేదనని అర్థం చేసుకొని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు రైతులకు పరిహారం చెల్లించాలని , స్థానిక మంత్రిగారు ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి రైతులకు ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని కిరణ్ తెలిపారు.