
మునుగోడు క్రైమ్ మిర్రర్ :- స్వతంత్ర ఫలాలను భావి భారత పౌరులకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్బంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కర్తవ్యంగా మన కోసం మన దేశం కోసం పనిచేసినట్లైతే రాబోయే రోజుల్లో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
Read also : చేవెళ్లలోని ఫామ్ హౌస్ లో ఫారిన్ వ్యక్తుల బర్త్ డే పార్టీ భగ్నం
పాఠశాల భవనాలు దేవాలయాలుగా ఉండాలి
మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ మురళి తో కలిసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. మండల కేంద్రాల్లో నిర్మించే క్లస్టర్ పాఠశాల ట్రెడిషనల్ హిస్టారికల్ భవనాల లాగా ఉండేలా ప్రణాళికలు రూపొందించబోతున్నామన్నారు. గ్రామస్థులు,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి , వివిధ మండలాల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read also : వీధి కుక్కల తరలింపు వివాదం.. భగ్గు మంటున్న పెట్ లవర్స్!