
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు భారత్ మరియు రష్యా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయని అధికారులు తెలిపారు. వైద్య మరియు ఆరోగ్య రంగాలలో సహకారం, వలసల విధానంపై పరస్పర సమన్వయం, కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ సరఫరా.. వీటితోపాటుగా సముద్రాహార ఉత్పత్తుల వాణిజ్యంపై కూడా ఇరుదేశాలు ఒక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. తదనంతరం మీడియా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇరుదేశాల మధ్య సన్నిహిత్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ మరియు రష్యా మధ్య స్నేహం ఎప్పటికీ ఉంటుంది అని తెలిపారు. రష్యా చాలా ఏళ్ల నుంచి మనకు మిత్ర దేశంగా ఉంది అంటూ పేర్కొన్నారు. ఇక 2030 వరకు కూడా భారత్ మరియు రష్యా మధ్య ఎకనామిక్ ప్రోగ్రాం కుదుర్చుకున్నాము అని మోడీ తెలియజేశారు. ఆర్థిక రంగంలో కూడా ఇరుదేశాల మధ్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్తున్నాం అని తెలిపారు. దీంతో భారత్ మరియు రష్యా దేశాలతో పాటు ఈ ఇరుదేశాల ప్రధాన మంత్రుల మధ్య గొప్ప బంధం ఉండడం దేశ ప్రజలకు సంతృప్తినిచ్చింది. వీరిద్దరూ ఇలానే కలిసి మెలిసి ఉంటూ ఇరుదేశాల అభివృద్ధికి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఇరుదేశాల ప్రజలు సూచిస్తున్నారు.
Read also : పిల్లలు ఫోన్లు పక్కనపెట్టి పుస్తకాలు చదవాలి : డిప్యూటీ సీఎం
Read also : ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక అసలు కారణం ఇదే : రస్సెల్





