
-
రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీనే
-
బీసీలపై బీజేపీకి ప్రేమ ఉంటే బిల్లును ఆమోదించాలి
-
బిల్లును కేంద్రం ఆమోదించకపోతే స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్లాలనేదానిపై ఆలోచిస్తాం
-
ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటాం: రేవంత్
-
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: రేవంత్
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై తమ ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై ఇక తుది నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఒక వేళ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్లాలనేదానిపై ఆలోచిస్తామని తెలిపారు. ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం, బీజేపీ కోర్టులోఉందని, బీసీలపై ప్రేమఉంటే బిల్లును ఆమోదించాలని అన్నారు.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే తమ కమిట్‌మెంట్ అన్నారు. కులగణన, రిజర్వేషన్ల సాధనలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్నారు. జంతర్‌మంతర్ వేదికగా కాంగ్రెస్ వాయిస్‌ను బలంగా విన్పించినట్లు తెలిపారు. తమ కమిట్‌మెంట్‌కు విపక్షాల నుంచి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు రేవంత్. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం బీఆర్‌ఎస్ నైజమన్నారు రేవంత్.
Read Also: