
జమ్ము కాశ్మీర్లోని పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారతదేశం అంతటా కూడా పాకిస్తాన్ పై చాలా కోపంగా ఉంది. ఈ ఎఫెక్ట్ భారతదేశం అంతటా కూడా తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా అగ్రహావేశంతో రగిలిపోతున్నారు. అయితే తాజాగా కర్ణాటకలో కొంతమంది క్రికెట్ ఆడడానికి స్టేడియం వచ్చారు. అయితే ఈ సందర్భంలోనే ఒక వ్యక్తి అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అనడంతో పక్కనే ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా అగ్రహావేశంతో పగిలిపోయి… చాలామంది కలిసి అతన్ని అక్కడికక్కడే కొట్టి చంపేశారు. వీటికి సంబంధించి అసలు వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రం, మంగళూరులోని కుడుపు ప్రాంతంలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా పది జట్లు పాల్గొన్నాయి. సుమారు వందమందికి పైగా మ్యాచ్ ఆడేందుకు స్టేడియం కి వచ్చారు. అందులో ఒక అతను పాకిస్తాన్ జిందాబాద్ అన్నందుకు… ఆవేశంతో ఊగిపోయిన పక్క జనం ఒక్కసారిగా అతనిని తీవ్రంగా గాయపరిచారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని ఆసుపత్రిలో చేర్చగా లోపల అభయవాలు బాగా దెబ్బ తినడంతో అక్కడికడి మరణించాడు. దీంతో చాలామంది పాకిస్తాన్ పేరు ఎత్తితేనే ఆవేశంతో ఊగిపోతున్నారు. మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడికి దాదాపు 30 మంది అమాయక ప్రాణాలు బలి కావడంతో దేశమంతటా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులపై తీవ్రంగా కోపాన్ని చూపిస్తున్నారు. దీని ఎఫెక్ట్ ఒక మనిషి ప్రాణం తీసింది.