సినిమా

అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ 9, ఆరుగురు సామాన్యులకు చోటు!

Bigg Boss 9 Telugu: ఎప్పుడెప్పుడా అని బుల్లితెర ప్రేక్షకులు ఎదరు చూసిన రియాలిటీ షో బిగ్ బాస్ 9 అట్టహాసంగా మొదలయ్యింది. గతంలో మాదిరిగానే అక్కినేని నాగార్జున హోస్టుగా చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి  సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కు అవకాశం కల్పించారు. ఒక్కొక్కరిగా ఇంట్లోకి పంపించాడు నాగార్జున. సోషల్ మీడియాలో ముందుగా వినిపించిన దాదాపు అందరి పేర్లు నిజం అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అందులో 9 మంది సెలబ్రిటీలు కాగా.. మరో ఆరుగురు సామాన్యు. వీళ్లు అగ్ని పరీక్షలో సత్తా చాటి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లు ఎవరంటే?

సెలబ్రిటీస్:

1.తనూజ (సీరియల్ నటి)

2..ఆశా షైనీ (సినిమా నటి)

3.ఇమ్మానుయేల్ (జబర్దస్త్ కమెడియన్)

4.సృష్టి వర్మ (కొరియోగ్రాఫర్ )

5.భరణి (సీరియల్ నటుడు)

6.రీతూ చౌదరి( సీరియల్ నటి)

7.సంజనా గల్రానీ (సినిమా నటి)

8.రాము రాథోడ్ (ఫోక్ సింగర్)

9.సునీల్ శెట్టి (కమెడియన్)

కామనర్స్ :

1.కల్యాణ్

2.హరిత హరీష్

3.డిమోన్ పవన్

4.దమ్ము శ్రీజ

2.ప్రియా శెట్టి

6.మనీష్

మొత్తం 150 మందికి రెండు హౌస్ లు ఇచ్చారు. కామనర్స్ ను హౌస్ ఓనర్స్ గా.. సెలబ్రిటీలను టెనెట్స్ గా పరిచయం చేశారు. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారో చూడాలి.

Back to top button