
-
బాలరాజుకు కండువా కప్పి ఆహ్వానించిన టి.బీజేపీ చీఫ్
-
తెలంగాణలో బీజేపీకి తిరుగులేదన్న గువ్వల
-
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ జీరోకి చేరిందని ఎద్దేవా
-
తనపై నిందలు ఊహించినవేనన్న బాలరాజు
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బాలరాజుకు కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు రామచంద్రరావు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా విశ్వసిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందన్నారు. బీజేపీని ఎగతాళి చేసిన బీఆర్‌ఎస్ ఇప్పుడు జీరోకి చేరుకుందని బాలరాజు ఎద్దేవా చేశారు. నాపై నిందలు వేస్తారని ముందే తెలుసని బాలరాజు చెప్పుకొచ్చారు. కాగా ఇటీవలే గులాబీ పార్టీకి బాలరాజు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
Read Also: