
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులను ఉద్దేశించి నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అలాగే దల్హన్ ఆత్మ నిర్భరత మిషన్ పథకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని విషయాలను పంచుకున్నారు. రైతులు బాగుంటేనే మన భారతదేశం కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా అన్నదాతల ముఖాల్లో ఆనందం, ధైర్యం, సంతోషం చూడడమే మా తొలి ప్రధాన్యత అని చెప్పారు.
ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అలాగే దళ్హన్ ఆత్మ నిర్భరత మిషన్ ఈ రెండు పథకాలు కోట్లాదిమంది రైతుల జీవితాలను మారుస్తాయని స్పష్టం చేశారు. కేవలం ఈ రెండు పథకాలకు ఏకంగా 35 వేల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది అని నరేంద్ర మోడీ వెల్లడించారు. మన భారతదేశంలో తమ ప్రభుత్వం వచ్చాకే వ్యవసాయంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకొచ్చామని… గతంలో కంటే ప్రస్తుతం ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయని వెల్లడించారు. అయితే మరోవైపు కొన్ని రాష్ట్రాల ప్రజలు మాత్రం కొన్ని పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేవు అని తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వీటిపై కూడా ప్రధానమంత్రి దృష్టి పెట్టాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి.
ఇక రాబోయే భవిష్యత్తులో మన భారతదేశం ఇంకా గొప్పగా ఎదుగుతుంది అని చెప్పుకొచ్చారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడవసారి భారత ప్రధానిగా ఎన్నికయ్యారు. దీన్నిబట్టి దేశవ్యాప్తంగా ప్రజలు మోడీకి ఎంత సపోర్ట్ గా నిలిచారు అనేది మరోసారి స్పష్టంగా అర్థమవుతుంది.
Read also : మిర్యాలగూడలో నేరాలపై కఠిన చర్యలు – డీఎస్పీ రాజశేఖర్ రాజు
Read also : <a style=”color:red”
href=”https://crimemirror.com/good-news-for-farmers-grain-purchasing-centers-open-with-a-bang/”>రైతులకు శుభవార్త.. అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం!