
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం అలాగే రాత్రి సమయాల్లోనే కాకుండా పగలు కూడా ఒక్కొక్క సందర్భంలో చలిగాలులు వీస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే ఈ చలిగాలుల ప్రభావం ఈ నెల 31వ తేదీ వరకు ఉంటుంది అని.. ఇక జనవరి నెల ప్రారంభంలో ఈ చలిగాలులు కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయని ఒక వైపు వాతావరణ నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు. ఇక చలి గాలులు తగ్గిన వెంటనే సాధారణ శీతాకాల పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జనవరి చివరి వారంలో మళ్లీ అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా అంచనా వేశారు. మరి వాతావరణ నిపుణులు అంచనా వేసిన ప్రకారం అసలు ఈ చలిగాలులు ఈనెల చివర ఆఖరిలోపు తగ్గుతాయి అంటే మాత్రం కొంతమంది నమ్మే అవకాశం లేదు అని అంటున్నారు. జనవరి నెల మొత్తం వరకు కూడా ఈ చలిగాలులు అంతే ఉండగా ఉష్ణోగ్రతలు కూడా మరింత పడిపోనున్నాయి అని అంటున్నారు. ఎన్నడు లేని విధంగా ఈసారి చలి మరింత ఉధృతంగా ఉంది. దీంతో ప్రజలు ఉదయం మరియు రాత్రి వేళలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాల పై వాతావరణ శాఖ అధికారులు మరింత స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
Read also : ఎన్నికకో పార్టీతో పొత్తు పెట్టుకుని సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు : కాకాణి గోవర్ధన్
Read also : పెన్సిల్ ఛాతిలో గుచ్చుకొని UKG బాలుడు మృతి!





