
-
పథకానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
-
దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో పథకం అమలుకు ప్రణాళికలు
-
ఆరేళ్లలో 100 జిల్లాలకు విస్తరించేలా కేంద్రం వ్యూహాలు
క్రైమ్ మిర్రర్, న్యూఢిల్లీ: మరో ప్రతిష్టాత్మక పథకం అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధే ధ్యేయంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2025-26 నుంచి ఆరేళ్ల మధ్య కాలంలో ఈ పథకం 100 జిల్లాలను కవర్ చేసేలా వ్యూహ రచన చేసినల్లు తెలిపారు.
కేంద్రమంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సెంట్రల్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, పంటల్లో వైవిధ్యం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, పంట దిగుబడులను నిల్వ చేసేందుకు గోడౌన్స్ సదుపాయం, నీటి సౌకర్యం మెరుగుపర్చడం, రుణాలు సులభతరం చేయడం వంటి లక్ష్యాలతో పీఎం ధన్ ధ్యాన్ యోజన పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని ఇతర పథకాలు, ప్రైవేట భాగస్వామ్యంతో కలిపి పథకాలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
దీంతో పాటు కేంద్రమంత్రివర్గం మరిన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇంధన రంగంలో పునరుత్పాదకత కోసం ఎన్టీపీసీకి రూ.20వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. అంతరిక్ష కేంద్రంలో 18రోజులు విజయవంతంగా గడిపి, అనేక పరిశోధనలు చేసి, భువికి తిరిగి వచ్చిన శుభాంషు శుక్లాకు సెంట్రల్ కేబినెట్ అభినందనలు తెలిపింది.