
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని రావులపేటకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడం జరిగింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక అసలు విషయానికి వస్తే తాడేపల్లిగూడెం మండలం, కుంచనపల్లి వద్ద జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని తణుకు వైపు వస్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో కారులో ఉన్న మండపేట పట్టణానికి చెందిన భోగిల్ల పాపారావు, కుమారుడు వెంకట సత్య సురేన్, భార్య నవ్య అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.
పవన్ కళ్యాణ్ స్పీచ్ పై… ఆసక్తికరంగా స్పందించిన చిరంజీవి!..
మృతులకు ఉన్న వాసవి కృష్ణ నాలుగు సంవత్సరాల పాపను తీవ్ర గాయాలతో ఉండగా తనకు ప్రభుత్వాసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ విషమించి మృతి చెందింది. ఆ కుటుంబ బంధువు ఉప్పులూరి శ్రీ రమ్య పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సురేన్ కుటుంబం హైదరాబాదు నుండి మండపేట కారులో వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఓనర్స్ ఉమ్మడి రాష్ట్ర అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ కీర్తిశేషులు భోగిల్లా విశ్వనాథం ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
రేవంత్ మరో మోసం..ఇందిరమ్మ ఇళ్లు ఇప్పట్లో లేనట్టేనా?