
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ న్యూస్ :- శ్రావణమాసం రావడంతో ఒకవైపు పెళ్లిళ్లు పనులు ప్రారంభమయ్యాయి. అలాగే మరోవైపు దేవాలయాల వైపు కూడా చాలామంది మళ్ళీ మొగ్గుచూపుతున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే శ్రావణమాసం రావడంతో చికెన్ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో చికెన్ స్కిన్ తో కలిపి 199 రూపాయలుగా ఉంది. అదే స్కిన్ లెస్ అయితే 226 రూపాయలుగా ఉంది. ఇక లైవ్ కోడి కేజీ 137 రూపాయలు పలుకుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో స్కిన్ లెస్ ధర కేజీ ₹200. స్కిన్ తో కలిపి 180 రూపాయలు. ఇక విజయవాడలోని పలు షాపులలో స్కిన్లెస్ 230 రూపాయలుగా ఉంది. అదే స్కిన్లెస్ అయితే 220 రూపాయలు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా విషయానికి వస్తే కేజీ చికెన్ ధర 190 రూపాయలు. అదే స్కిన్ లెస్ అయితే 220 రూపాయలు. ఇక న్యూజివీడు ప్రాంతంలో కేజీ చికెన్ ధర 190 రూపాయలు. అదే స్కిన్లెస్ అయితే 223 రూపాయలు.
ఇక మటన్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో కిలో 900 రూపాయలు పలుకుతుంది. అదే న్యూజివీడు ప్రాంతంలో కిలో మటన్ ధర 800 రూపాయలు పలుకుతుంది. కొద్దిరోజుల పాటు శ్రావణమాసం ఉండడంతో చాలామంది ప్రజలు నాన్ వెజ్ తినడం మానేశారు. దీంతో రాబోయే కొద్ది రోజులలో ఈ చికెన్ మరియు మటన్ ధరలు ఇంకా పడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అధికారులు తెలియజేస్తున్నారు. శ్రావణ మాసపు వేళా దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అందరూ కూడా నాన్వెజ్ తినడం ఆపేస్తారు. అందుకే నాన్ వెజ్ ధరలు అనేవి ఇకనుండి రోజురోజు కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఆదాయం తక్కువ… అప్పులు మాత్రం విపరీతం : వైఎస్ జగన్
ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే.. రోజుకు 4000 అడుగులు నడవాల్సిందే!