
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- జూనియర్ ఎన్టీఆర్ ను అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అసభ్యకరమైన పదజాలంతో దూషించినట్లుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో పై తాజాగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ను నేను ఎందుకు తిడతాను అని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశారు. ఎవరో కావాలనే నాపై కోపం ఉన్నవారు ఇలా ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Read also : దైవ దర్శనానికి వెళ్లి తిరిగి రాలేదన్న ఆందోళన.. చివరకు ఇంటికి చేరుకున్న సత్యనారాయణ
జూనియర్ ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీ అలాగే నారావారి ఫ్యామిలీ అంటే నాకు చాలా అభిమానం, గౌరవం కూడా అని అన్నారు. అలాంటి వారిపై నేను అసభ్యకరంగా వ్యాఖ్యలు ఎందుకు చేస్తాను అని ప్రశ్నించారు. ఫేక్ వీడియోలు సృష్టించి.. గౌరవ మర్యాదలను దెబ్బతీయకండి అని.. ఫేక్ వీడియోలు సృష్టించే వారిపై కచ్చితంగా కేసు నమోదు చేయించి వారిని బయట పెడతానని అన్నారు. ఇప్పటికే ఈ ఫేక్ వీడియోపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. నందమూరి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియో చూసి బాధపడి ఉంటే.. తక్షణమే నన్ను క్షమించాలి అని కోరారు. ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే ఫేక్ వీడియో సృష్టించిన వారిని మీడియా వేదిక ముందు నిలబెడతానని వీడియో వీడియో రూపంలో తెలుగు రాష్ట్రాలకు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యానించారు. కాగా వచ్చిన తర్వాత నుంచి ఫేక్ వీడియోలు చిన్న నాయకుల నుంచి పెద్ద పెద్ద నాయకులు వరకు కూడా ఎన్నో విధాలుగా సమస్యలను ఎదుర్కొన్నారు. కోపం ఉన్నవారు ఇలాంటి రూపంలో పగ తీర్చుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు వల్ల చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Read also : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు – నిండుకుండను తలపిస్తున్న జలాశయం