
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకీ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఇక తాజాగా మాజీ ఎంపీ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాల గురించి తన విశ్లేషణలు తెలియజేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. కాగా తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రాష్ట్ర రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ గురించి విశ్లేషణలు జరిపారు. కాగా ఈ ఎలక్షన్లో బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగి ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వంపై మెల్లిమెల్లిగా వ్యతిరేకత వస్తుంది అనే వాదనలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరోసారి కూటమి ప్రభుత్వమే మరోసారి అధికారం చేపడుతుందని అన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని తెలిసి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రారు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిపోయాయి. నిజానికి ఈయన వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత విధేయత కలిగిన నేత. అలాంటి రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే నేను ఎంపీ అయ్యానని కృతజ్ఞతగా అరుణ్ కుమార్ చెబుతూ ఉంటారు. ఏ పార్టీతో సంబంధాలు లేకుండా రాజకీయాల గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణలు చేస్తూ తన అభిప్రాయాలను వార్తల ద్వారా తెలియజేస్తూ ఉంటారు.