
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:-బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్లో వచ్చినటువంటి అఖండ-2 సినిమా ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమా దెబ్బకు ధియేటర్ల లోని స్పీకర్లు పగిలిపోవడం ఖాయమని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే నిజంగానే నిన్న రాత్రి తణుకులో ఒక థియేటర్ లోని స్క్రీన్ కు మంటలు వ్యాపించాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఒక్కసారిగా స్క్రీన్ పై మంటలు కనిపించడంతో షాకు కు గురయ్యారు. వెంటనే సినిమా హాల్ యాజమాన్యానికి ఈ విషయాన్ని తెలియజేయగా వారు కాసేపు షో ఆపివేసినట్లు తెలిపారు.
Read also : గిల్ పూర్తిగా విఫలం.. జైస్వాల్ రావాల్సిందే..?
ఇప్పటికే ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ కు థియేటర్లు అన్ని కూడా షేక్ అవుతున్నాయి. గతంలో అఖండ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇలానే కొన్ని స్క్రీన్లు పాడైపోయాయి. ఎన్నో స్పీకర్లు ఈ మ్యూజిక్ దెబ్బకు రిపేర్లు చేయించుకోవాల్సి వస్తుంది. మరోవైపు ఈ సినిమా విడుదలకు ఎన్నో అడ్డంకులు వచ్చిన కూడా చివరికి విడుదలయ్యి అందరి మనసులను దోచుకుంటుంది. ఈ సినిమాలో బాలకృష్ణ నటన అలాగే యాక్షన్స్ సన్నీ వేషాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు పొగిడేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాలో నటించినటువంటి నటులందరూ కూడా తమ విశ్వనటనను చూపించారు. ఇకపోతే ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి ఎక్కువగా ఉండడంతో చాలామంది మహిళలు సినిమా చివరిలో శివుడి మరియు బాలకృష్ణ తాండవం ను చూసి ఊగిపోయారు.
Read also : కమ్మేస్తున్న పొగ మంచు.. ప్రధాని విదేశీ పర్యటన ఆలస్యం





