క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :
నకిలీ ఫోన్ పే యాప్స్ తో జర జాగ్రత్తగా ఉండాలని టీ జి ఎస్ ఆర్ టి సి ఎండి సజ్జనార్ సూచించారు. కొంతమంది కేటుగాళ్లు కొంత డబ్బు చెల్లిస్తే మీకు నకిలీ యాప్ పంపిస్తామని చెప్పి పెద్ద మొత్తంలో మోసం చేస్తారని తెలియజేశారు. అలాంటి నకిలీ apk ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోవద్దు అంటూ సలహా ఇచ్చారు. కాగా తాజాగా నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా చాలామంది ఫేక్ డబ్బులు పంపుతూ చాలామందిని సులభంగా మోసం చేస్తున్నారు. వీటి గురించి తాజాగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. ఈ నకిలీ యాప్ ద్వారా అకౌంట్ లో డబ్బులు లేకపోయినా డబ్బులు పంపించే విధంగా సేమ్ ఫోన్ పే యాప్ లానే పనిచేస్తుండడంతో చాలామంది కేటుగాళ్లు దీనిని ఆసరాగా చేసుకుని నకిలీ డబ్బును పంపి చాలామంది వ్యాపారులను అలాగే అమాయకులను మోసం చేస్తూ ఉన్నారని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ప్రజలకు సలహాలు అందించారు.
ఇవి కూడా చదవండి
1.అమరావతిలో అమిత్ షా.. పవన్, బండితో స్పెషల్ మీటింగ్!
2.రష్యా vs ఉక్రెయిన్ యుద్ధం!… 12 మంది భారతీయులు మృతి?