
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళలకు ఫ్రీ బస్సు బంద్ కానుంది. తెలంగాణలో బస్సులు బంద్ కానున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం లెక్కచేయని ఆర్టీసీ జేఏసీ లెక్కచేయడం లేదు.
ఆర్టీసీ సమ్మెతో రేపటి నుంచి డిపోలకే పరిమితం కానున్నాయి ఆర్టీసీ బస్సులు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ 21 రకాల సమస్యలు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో 10 వేల బస్సులు ఉండగా.. దాదాపు 40 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సమ్మెలో మెజార్టీ కార్మికులు పాల్గొనే అవకాశం ఉంది. కార్మికులు సమ్మెలోకి దిగితే మహాలక్ష్మి పథకం కింద అమలువుతున్న మహిళకు ఫ్రీ జర్నీ బంద్ కానుంది.
మరోవైపు సమ్మె విషయంలో రెండుగా చీలింది ఆర్టీసీ కార్మిక జేఏసీ. థామస్ రెడ్డి, వెంక్నన వర్గాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. వీళ్లకు పలు ఇతర సంఘాలు మద్దతు ఇస్తున్నారు. జేఏసీ మాజీ చైర్మెన్ అశ్వత్థామ రెడ్డి వర్గం మాత్రం సమ్మెకు దూరంగా ఉండాలని సూచిస్తోంది. అయితే మెజార్టీ సంఘాలు సమ్మెలో వెళుతుండటంతో ఆర్టీసీపై ప్రభావం భారీగానే ఉండే అవకాశం ఉంది. అంతేకాదు అశ్వత్థామ రెడ్డి ఆర్టీసీ కార్మిక ద్రోహి అని ఆరోపిస్తున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు.